Share News

Viral Video: యువతిపై బీరు ప్రాంక్.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

ABN , Publish Date - May 13 , 2025 | 12:36 PM

Viral Video: ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలిసి నడుచుకుంటూ వెళుతోంది. చేతిలో బీరు మగ్గుతో ఉన్న వ్యక్తి వారిని ఆపాడు. నీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తాగడానికేమో అనుకున్న యువతి బ్యాగులో ఉన్న బాటిల్ బయటకు తీసింది.

Viral Video: యువతిపై బీరు ప్రాంక్.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Viral Video

కొన్నేళ్ళ ముందు ప్రాంక్ వీడియోలకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉండేది. సోషల్ మీడియాలో పాపులర్ కావాలనుకున్న వారందరూ ప్రాంక్‌లు చేయటం మొదలెట్టారు. పాపులర్ అయ్యారు కూడా. అయితే.. ఇప్పుడు ప్రాంక్‌లకు అంత క్రేజ్ లేకుండా పోయింది. అయినా కూడా కొంతమంది సోషల్ మీడియా పాపులారిటీ కోసం ప్రాంక్‌లు చేస్తున్నారు. ప్రాంక్‌ల పేరుతో.. త్వరగా పేరు తెచ్చుకోవాలన్న ఉబలాటంతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు ప్రాంక్‌లు బ్యాక్ ఫైర్ అవుతూ ఉన్నాయి. తాజాగా, ఓ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న యువతిపై బీరు ప్రాంక్ చేశాడు.


ఆ ప్రాంక్ కారణంగా అతడు చిక్కుల్లో పడ్డాడు. నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంకుల పేరుతో జనాలను ఇబ్బంది పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంక్ వీడియోలో ఏముందంటే.. ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలిసి నడుచుకుంటూ వెళుతోంది. చేతిలో బీరు మగ్గుతో ఉన్న వ్యక్తి వారిని ఆపాడు. నీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తాగడానికేమో అనుకున్న యువతి బ్యాగులో ఉన్న బాటిల్ బయటకు తీసింది. అయితే, అతడు చేతిలో బీరు మగ్గుతో కనిపించటంతో బాటిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.


అప్పుడు ఆ యువకుడు మగ్గులోని బీరును ఆమె మీద పోస్తున్నట్లు ప్రాంక్ చేశాడు. ఆ యువతి హడలిపోయింది. ఆ వెంటనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతి స్నేహితురాలు కూడా అతడిపై మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు యువకుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఆడవాళ్లకు కొంతైన మర్యాద ఇవ్వండి’..‘ అది కామెడీగా లేదు.. వాళ్లను వేధిస్తున్నట్లు ఉంది’.. ‘ ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టవద్దు. పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అంటూ ఫైర్ అవుతున్నారు.


ఇవి కూడా చదవండి

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. లష్కర్ ఈ తోయిబా టెర్రరిస్ట్ హతం

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..

Updated Date - May 13 , 2025 | 12:39 PM