Hyderabad Metro Train: మెట్రో సేవల్లో అంతరాయం.. ఆ రూట్‌లో ఆగిన ట్రైన్స్..
ABN, Publish Date - May 01 , 2025 | 06:03 PM
హైదరాబాద్ మెట్రో రైల్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అరగంట పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. మియాపూర్ టు ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో ట్రైన్స్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
Metro Train
హైదరాబాద్ మెట్రో రైల్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అరగంట పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. మియాపూర్ టు ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో ట్రైన్స్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు భారత్ నగర్ స్టేషన్ వద్ద మెట్రో రైళ్లు నిలిచిపోయింది.దీంతో మెట్రో రైల్‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో సాంకేతిక సమస్యల కారణంగా తరచూ మెట్రో రైళ్లు మోరాయిస్తున్నాయి.
Updated Date - May 01 , 2025 | 06:26 PM