Hyderabad: తాను చనిపోతూ.. మరికొందరికి..
ABN, Publish Date - Jun 05 , 2025 | 09:36 AM
తాను చనిపోతూ.. మరికొందరికి జీవితాన్ని ప్రసాదించాడో వ్యక్తి. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట శివాజీనగర్‌కు చెందిన గూడ పార్థసారధి.. ప్రైవేట్ ఉద్యోగి. జూన్ 1వ తేదీన బైక్‌పై వెళ్తుండగా జిన్నారం వద్ద ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు.
- బెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం
హైదరాబాద్: ఓ వ్యక్తి తాను మరణిస్తూ అవయవదానంతో మరికొందరికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట శివాజీనగర్‌కు చెందిన గూడ పార్థసారధి(39) ప్రైవేట్ ఉద్యోగి. జూన్ 1వ తేదీన బైక్‌పై వెళ్తుండగా జిన్నారం వద్ద ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో కుబుంబసభ్యులు అతడిని హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఈనెల 3వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు.
అయవయదానంపై జీవన్‌దాన్ సభ్యులు మృతుడి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. పార్థసారధి భార్య మమత అందుకు అంగీకరించారు. పార్థసారధి లివర్, కిడ్నీలు, కార్నియాలు సేకరించిన వైద్యులు కొందరికి అమర్చి ప్రాణదానం చేశారు. జీవన్ ప్రోగ్రాం ద్వారా 2025 జనవరి నుంచి జూన్ 4 వరకు అవయవ దానం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి 89 డొనేషన్లను స్వీకరించినట్టు జీవన్‌దాన్ నోడల్ అధికారి ప్రొఫెసర్ శ్రీభూషణ్‌రాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 05 , 2025 | 09:36 AM