Hyderabad: స్పెయిన్‌లోనే డ్రగ్స్‌కు అలవాటుపడ్డ డాక్టర్ నమ్రత!
ABN, Publish Date - May 12 , 2025 | 05:23 AM
మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తూ పట్టుబడిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సీహెచ్ నమ్రత కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు.
డ్రగ్ డీలర్ వంశ్‌టక్కర్ కోసం ముంబైకి పోలీసు బృందాలు
హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తూ పట్టుబడిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సీహెచ్ నమ్రత కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. ఆమె నుంచి సేకరించిన సమాచారం మేరకు.. ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వంశ్ టక్కర్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన రెండు బృందాలు ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక, ఆంకాలజిస్టు అయిన డాక్టర్ నమ్రత ఉన్నత విద్య కోసం స్పెయున్ వెళ్లినప్పుడు అక్కడ డ్రగ్స్‌కు అలవాటు పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నమ్రత దాదాపు మూడేళ్లుగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని గుర్తించారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన నమ్రత మత్తుమందులకు బానిస కావడంతో.. సన్నిహితులే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను పట్టించారని, అలాగైతే ఆమెను పునరావాస కేంద్రానికి పంపించవచ్చని చేశారని తెలుస్తోంది. నమ్రత మత్తుమందుల కోసం ఏడాదిలో రూ.కోటికి పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. వంశ్ టక్కర్‌కు నమ్రతతోపాటు హైదరాబాద్‌లో ఇంకా చాలామంది కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 12 , 2025 | 05:23 AM