High Court: కొందరు అధికారులే నిజమైన అంధులు
ABN, Publish Date - Apr 08 , 2025 | 03:55 AM
అంధ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని కొంతమంది ప్రభుత్వ అధికారులే నిజమైన అంధులని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంధ ఉద్యోగులను కోర్టు చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అంధ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని కొంతమంది ప్రభుత్వ అధికారులే నిజమైన అంధులని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంధులను కోర్టుల చుట్టూ తిప్పడంపై అహసనం వ్యక్తం చేసింది. వివిధ కారణాలు చూపుతూ అక్రమంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని పేర్కొంటూ పలువురు అంధ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.
వీటిపై సోమవారం జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేసింది. పిటిషనర్‌లు కోర్టుల చుట్టూ తిరగడానికి కారణమైన అధికారుల తీరును తప్పుబట్టింది.
Updated Date - Apr 08 , 2025 | 03:55 AM