High Court: గ్రూప్-1పై వాదనలు త్వరగా ముగించండి
ABN, Publish Date - Jul 01 , 2025 | 04:56 AM
గ్రూప్-1 పరీక్షల పిటిషన్లపై వాదనలను త్వరగా ముగించాలని హైకోర్టు సంబంధిత న్యాయవాదులను సూచించింది. నియామకపత్రాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేసింది.
అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు: హైకోర్టు
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షల పిటిషన్లపై వాదనలను త్వరగా ముగించాలని హైకోర్టు సంబంధిత న్యాయవాదులను సూచించింది. నియామకపత్రాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేసింది. సమాధాన పత్రాలు సరిగా దిద్దలేదని, మూల్యాంకనంలో అక్రమాలు, తుది అభ్యర్థుల సంఖ్యలో తేడాలు సహా అనేక లోపాలున్నాయని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున నియామక పత్రాలు ఇవ్వరాదని స్టే విధించింది.
ఆ స్టే ఎత్తేయాలని కోరుతూ టీజీపీఎస్సీ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. వీటిన్నింటిపై సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్ న్యాయవాదులు జీ విద్యాసాగర్, సురేందర్‌రావు వాదనలు కొనసాగించారు. కోర్టు సమయం ముగియడంతో వాదనలు మంగళవారానికి వాయిదాపడ్డాయి.
Updated Date - Jul 01 , 2025 | 04:56 AM