ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: సీఎం చేతగానితనం పంచాయతీ సిబ్బందికి శాపం

ABN, Publish Date - Jun 12 , 2025 | 03:12 AM

ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పాలన పడకేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం పంచాయతీ అధికారులు, పారిశుధ్య సిబ్బందికి శాపంగా మారిందని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

  • నిధులిచ్చి పంచాయతీ వ్యవస్థను గాడిన పెట్టాలి: హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పాలన పడకేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం పంచాయతీ అధికారులు, పారిశుధ్య సిబ్బందికి శాపంగా మారిందని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. నిధుల్లేక గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడిందని, ప్రతి నెలా నిధులు విడుదల చేయకుండా నిర్వహణను గాలికొదిలేయడంతో గ్రామాలు మురికి కూపాలవుతున్నాయని పేర్కొన్నారు.

పాలన గాలికి వదిలేసి ముగ్గురు మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయించేందుకు మూడు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసిన సీఎం ఇప్పటికైనా కళ్లుతెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని, పాడైపోతున్న గ్రామపంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 03:12 AM