Tummala: 35,000 మందికి 2,500 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు: తుమ్మల
ABN, Publish Date - Jun 06 , 2025 | 03:08 AM
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్2న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 35,000 మంది అభ్యుదయ రైతులకు సుమారు 2,500 క్వింటాళ్ల మూల విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశామని చెప్పారు.
వరిలో 20 వేలు, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతులకు అందజేసినట్లు వివరించారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్ధతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడేళ్లలో ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్థి సాధిస్తుందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2025 | 03:08 AM