ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Formation Day: పురోభివృద్ధి దిశగా తెలంగాణ

ABN, Publish Date - Jun 03 , 2025 | 03:51 AM

కొత్తగా ఏర్పడిన తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అన్నివర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విభాగాలు పని చేస్తున్నాయని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు.

  • సంస్కృతిని భవిష్యత్‌ తరాలకు అందించాలి: గవర్నర్‌

  • తేనీటి విందుకు హాజరైన సీఎం రేవంత్‌, మిస్‌వరల్డ్‌ సుచాత

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పడిన తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అన్నివర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విభాగాలు పని చేస్తున్నాయని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రజలు ఐక్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ.. అన్ని విధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భవిష్యత్‌ తరాలకు అందించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. కాగా, మిస్‌ వరల్డ్‌ పోటీల్లో విజేతగా నిలిచిన ఓపల్‌ సుచాత, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న ముగ్గురు సుందరీమణులకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌, గవర్నర్‌ జిష్ణుదేవ్‌శర్మ, గవర్నర్‌ సతీమణి తదితరులు మిస్‌వరల్డ్‌ విజేత సుచాతను సన్మానించారు.

Updated Date - Jun 03 , 2025 | 03:51 AM