Governor Jishnu Dev Varma: హోంశాఖకు ‘బీసీ రిజర్వేషన్ల’ ఆర్డినెన్స్
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:23 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టం-2018లో ఉన్న రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితిని తొలగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర ప్రభుత్వ సలహా కోరినట్టు సమా చారం.
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టం-2018లో ఉన్న రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితిని తొలగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర ప్రభుత్వ సలహా కోరినట్టు సమా చారం. ఈ ఆర్డినెన్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి? న్యాయపరమైన అంశాలేమైనా ఇమిడి ఉన్నాయా? అని ఆయన అడిగినట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు ధ్రువీకరించట్లేదు. రెండు రోజుల క్రితం ఇదే అంశంపై ఆయన అడ్వొకేట్ జనరల్ (ఏ.జీ)తో పాటు ఇతర న్యాయ నిపుణులతో గవర్నర్ భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌పై తనకున్న అనుమానాలను వారి ముందుంచారు. ఈ అంశం రాష్ట్ర పరిధిలో ఉందా, ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా? అని ప్రశ్నించినట్టు.. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీం తీర్పు గురించి ఆయన ప్రస్తావించినట్టు సమాచారం.
ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి.. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(ఏ)కి మాత్రమే సవరణ చేయాలన్న సర్కారు నిర్ణయం గురించి అడ్వొకేట్ జనరల్ ఆయనకు విపులంగా వివరించినట్టు తెలిసింది. కాగా హైకోర్టు సూచించిన మేరకు రిజర్వేషన్ల ఖరారుకు గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో నిర్వహించే క్యాబినెట్ భేటీలో చర్చించాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. రిజర్వేషన్ల కల్పనపై ముందుకెలా వెళ్లాలనేదానిపైనా చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
‘కులగణన’ ప్రజెంటేషన్‌పై రేవంత్‌కు సోనియా అభినందన
ముందే నిర్ణయుంచుకున్న కార్యక్రమాల వల్ల హాజరుకాలేకపోయానంటూ లేఖ
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కులగణన సర్వే ప్రజెంటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభినందించారు. ఈ మేరకు రేవంత్‌కు ఒక లేఖ పంపారు. గురువారం ఢిల్లీలో ఇచ్చిన ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే 2024‘ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు తనను ఆహ్వానించడం సంతోషకరమని చెప్పారు. అయితే ముందే నిర్ణయమైన ఇతర కార్యక్రమాల నేపథ్యంలో ప్రజెంటేషన్‌కు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. ఈ ప్రజెంటేషన్ విజయవంతమైన కార్యక్రమమని, ఇందులో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 04:23 AM