Jishnudev Varma: ప్రజలతో మమేకమే.. ప్రజాసేవ సారాంశం
ABN, Publish Date - Jun 05 , 2025 | 03:41 AM
‘ప్రయాణం చేయండి, ప్రజలను కలవండి, వారితో సన్నిహితంగా ఉండండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి.
ట్రైనీ ఐఏఎ్‌సలతో గవర్నర్
హైదరాబాద్, జూన్4 (ఆంధ్రజ్యోతి): ‘ప్రయాణం చేయండి, ప్రజలను కలవండి, వారితో సన్నిహితంగా ఉండండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి. ఇదే ప్రజాసేవ సారాంశం’ అని తెలంగాణ కేడర్ ట్రైనీ ఐఏఎస్ అధికారుల (అసిస్టెంట్ కలెక్టర్లు)కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల ఉన్న ఉపయోగాలను వివరించారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికి సానుకూల కృషికి అపార అవకాశాలున్నాయని అన్నారు.
ఎంసీఆర్‌హెచ్‌డీ వైస్ చైర్మన్ శాంతికుమారి, కోర్సు డైరక్టర్ ఉషారాణి శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చారు. పాలనలో రాజ్‌భవన్ పాత్ర, గవర్నర్ బాధ్యతలను గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ వారికి వివరించారు. కాగా, సివిల్ సర్వీసె్‌సలో ఈ విజయం మీ క్రమశిక్షణ, సంకల్పం, పట్టుదలకు ఫలితమని సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపికైన అభ్యర్థులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసె్‌సలో విజేతలైన అభ్యర్థులను బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ సన్మానించారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 05 , 2025 | 03:41 AM