Tribal Skill Drive: ఆదివాసీ యువతకు గవర్నర్ ఆపన్న హస్తం
ABN, Publish Date - May 04 , 2025 | 04:02 AM
నల్లమల ఆదివాసీ యువతకు ప్లేట్ల తయారీ శిక్షణతో ఉపాధి కల్పించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముందుకొచ్చారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో వాహనాల ద్వారా యంత్రాల పంపిణీ ప్రారంభమైంది.
మరింత చేయూత అందించాలన్న జిష్ణుదేవ్‌వర్మ
హైదరాబాద్, మే3 (ఆంధ్రజ్యోతి): నల్లమల ప్రాంతాల్లోని ఆదివాసీ యువతకు శిక్షణ ఇప్పించి పరోక్ష ఉపాధి కల్పిస్తున్న ప్రాజెక్టులో గవర్నర్ కార్యాలయం భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చెప్పారు. తనకున్న ప్రత్యేక అధికారాలతో యువతకు అటవీ ఆకులతో ప్లేట్ల తయారీలో శిక్షణ ఇప్పించామని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ 32 మంది ఆదివాసీ యువతీ, యువకులతో సమావేశమై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలకు ఆర్ధిక పరిపుష్టి కలగాలంటే మరింత చేయూత అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలకు ఇచ్చిన ప్లేట్ల తయారీ యంత్రాల వాహనాలను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.
Updated Date - May 04 , 2025 | 04:02 AM