ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet: తాజా మాజీ సర్పంచ్‌ లావణ్యకు ఇందిరమ్మ ఇల్లు

ABN, Publish Date - Jul 27 , 2025 | 04:54 AM

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండా మాజీ సర్పంచ్‌ సందేబోయిన లావణ్య కష్టా న్ని ప్రభుత్వం గుర్తించింది.

అక్కన్నపేట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండా మాజీ సర్పంచ్‌ సందేబోయిన లావణ్య కష్టా న్ని ప్రభుత్వం గుర్తించింది. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు నిర్వహించి బిల్లులు రాక ఉన్నదంతా కోల్పో యి మూతబడిన ప్రభుత్వ పాఠశాల భవనంలో ఆశ్రయం పొందుతున్న ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం తెలిపారు.

లావణ్య దీనస్థితిపై ‘నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మంత్రి ఆదేశాల తో అధికారులు లావణ్య వివరాలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం పట్ల లావణ్య ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 27 , 2025 | 04:54 AM