ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గీతం విద్యార్థికి రూ.1.4 కోట్ల వార్షిక వేతనం

ABN, Publish Date - Apr 30 , 2025 | 03:32 AM

గీతం యూనివర్సిటీ విద్యార్థిని ప్రియాంక రెడ్డి ఏడాదికి రూ.1.4 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం సాధించింది. ఈ ఏడాది క్యాంపస్ నియామకాల్లో 270కి పైగా కంపెనీలు పాల్గొని అనేక మంది విద్యార్థులను ఎంపిక చేశాయి

ప్రాంగణ నియామకాల్లో అమెజాన్‌కు ఎంపికైన ప్రియాంక రెడ్డి

అత్యధికంగా యాక్సెంచర్‌కు 91 మంది విద్యార్థులు

పటాన్‌చెరు రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి ): ఏడాదికి రూ. 1.4 కోట్ల వేతనంతో గీతం విద్యార్థిని కారుమూరు ప్రియాంక రెడ్డి ప్రతిష్ఠాత్మక అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం సాధించింది. ప్రియాంక గీతం యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంప్‌సలో సీఎ్‌సఈ విద్యార్థిని. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 270కి పైగా బహుళ జాతి కంపెనీలు హైదరాబాదు గీతంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించాయని గీతం వర్గాలు తెలిపాయి. అత్యధికంగా యాక్సెంచర్‌ కంపెనీకి 91 మంది విద్యార్థులు ఎంపికవగా, టెక్‌ మహింద్రా సంస్థకు 87 మంది, రినెక్స్‌ టెక్నాలజీ స్ కు 70 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించింది. అట్లాసియన్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, డెలాయిట్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు ఆకర్షణీయమైన వేతనాలతో వివిధ విభాగాలకు చెందిన గీతం విద్యార్థులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నాయి. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంప్‌సలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 03:32 AM