Gali Janardhan Reddy: చంచల్‌గూడ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కుదరవు
ABN, Publish Date - May 16 , 2025 | 03:06 AM
ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశ ఎదురయింది.
గాలి జనార్దన్ రెడ్డి వినతిని తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశ ఎదురయింది. ఓఎంసీ కేసులో ఏ2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష పడడంతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తనకు కారాగారంలో ప్రత్యేక వసతులు కల్పించాల్సిందిగా రెండ్రోజుల కిందట ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గురువారం దానిని న్యాయస్థానం పరిశీలించింది. నేరం రుజువైనందున శిక్ష పడిందని, నేరస్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కుదరదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఆరోగ్య సమస్యలు, వయోభారంతో పాటు ప్రజాప్రతినిధి (కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే)ని అయినందున తనకు జైలులో ‘ఏ’ క్లాస్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించింది.
Updated Date - May 16 , 2025 | 03:06 AM