CM Revanth Reddy: పథకాల బౌండరీ
ABN, Publish Date - Jan 26 , 2025 | 03:26 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు కీలక పథకాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది.
నేటి నుంచే ఇందిరమ్మ ఇళ్లు, రైతు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు
కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్న రేవంత్
నేడు నారాయణపేట జిల్లా చంద్రవంచకు సీఎం
తొలుత మండలానికో గ్రామంలో పూర్తిస్థాయిలో
622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధ్రువపత్రాలు
రైతు భరోసా, ఆత్మీయ భరోసా 606 గ్రామాల్లో..
నేటి రాత్రి 12 గంటల తర్వాత ఖాతాల్లోకి డబ్బు
వచ్చేనెల క్యాబినెట్.. ఇతర లబ్ధిదారుల ఖరారు
మార్చి 31లోపు పథకాలు పూర్తిగా అమలు
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు కీలక పథకాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని.. దరఖాస్తుల స్వీకరణ, గ్రామసభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది. కానీ, లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పథకాలను మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, నాలుగు పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భట్టి, ముగ్గురు మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నాలుగు పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లబ్ధిదారుల వివరాలు కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నాయి. దరఖాస్తుల ఖరారు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున.. ముందుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో నాలుగు పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. ఆ గ్రామంలో నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ఎంత మంది ఉంటే అంత మందికీ మంజూ రు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 622 రెవె న్యూ మండలాలు ఉన్నాయి. వీటిలో మండలానికి ఒక గ్రామం చొప్పున 622 గ్రామాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు కానున్నాయి. కానీ, హైదరాబాద్‌లోని మండలాలకు రైతు భరోసా, ఇందిర ఆత్మీయ భరోసా పథకాల ఆవశ్యకత లేనందున.. మిగతా జిల్లాల్లో ఉన్న 606 మండలాల్లోని 606 గ్రామాల్లో మొత్తం నాలుగు పథకాలను అ మ లు చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. నారాయణపే ట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేస్తారు. రేషన్ కార్డులు కూడా ఇస్తారు.
రాత్రి 12 తరువాత రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
నగదు బదిలీతో కూడిన రైతు భరోసా, ఇందిర ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 26న ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నందున.. రాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ అ వుతుందని అధికార వర్గాలు వివరించాయి. అయి తే.. రైతు భరోసా పథకం కింద సొమ్మును గతంలోని రైతుబంధు పథకం మాదిరిగానే.. ముందుగా ఎకరం భూమి ఉన్నవారికి, తర్వాత రెండెకరాల వారికి, మూడెకరాల వారికి, నాలుగెకరాల వారికి.. వరుసగా బ్యాంకు ఖాతాల్లో వేస్తా రు. ఇలా కోటి 40 లక్షల ఎకరాలకు ఈ స్కీము వర్తించే అవకాశాలున్నట్లు ప్రాథమికంగా తేల్చా రు. ఆత్మీయ భరోసా పథకం కింద కూడా సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. నాలుగు పథకాలకు సంబంధించి మిగతా గ్రామాల లబ్ధిదారుల సంఖ్యను తేల్చడానికి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నాటికి రాష్ట్రంలోని ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా పూర్తవుతుంది. ఈ జాబితాలను పరిశీలించి, అమలు కార్యాచరణ ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఏ పథకానికి ఎప్పుడెప్పు డు ఆర్థిక సాయం అందించాలన్న దానిపై నిర్ణ యం తీసుకుంటారు. ఈ ప్రక్రియను మార్చి 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అర్హులందరికీ 4 పథకాలు: భట్టివిక్రమార్క
అర్హులైన వారందరికీ 4 ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తికీ పథకాలను వర్తింపజేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల వర్తింపు వంటి ప్రక్రియ ను మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. దరఖాస్తుదారుల సంఖ్య లక్ష ల్లో ఉండడం వల్ల మార్చి వరకు గడువు పెట్టామని తెలిపారు. కాగా, రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ప్రజాపాలన సేవా కేంద్రంల్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 4 పథకాలను ఈనెల 26 నుంచే రాష్ట్రమంతటా అమలు చేయాలని అనుకున్నప్పటికీ.. దరఖాస్తులు ఇంకా వస్తుండడ వల్ల మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు.
కొడంగల్ నుంచే నాలుగు పథకాలు
నేడు చంద్రవచకు సీఎం
హైదరాబాద్, మహబూబ్‌నగర్, కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు పథకాలను కొడంగల్ పరిధిలోని చంద్రవంచలో సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఆదివారం గణతంత్ర వేడుకలను ముగించుకొని నేరుగా చంద్రవంచకు సీఎం చేరుకుంటారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు జారీచేయడంతో పాటు నూతన రేషన్ కార్డులను కూడా అందజేస్తారు. రైతు భరోసాతోపాటు వ్యవసాయ కూలీల కోసం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తారు.
సీఎం షెడ్యూల్..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరుల సైనిక స్మారక స్థూపం దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు.
ఎయిర్ వార్‌ఫేర్ నుంచి బయలుదేరి అంబేడ్కర్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం చంద్రవంచకు వెళ్లి.. అక్కడ పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగే గవర్నర్ ‘ఎట్ హోం’ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 03:26 AM