ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఏసీబీ నోటీసులతో హడలిపోతున్న కేటీఆర్‌

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:39 AM

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసులతో కేటీఆర్‌ హడలిపోతున్నాడని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. విచారణకు వెళ్తానంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బడాయి కబుర్లు చెబుతున్నాడని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.

  • జైలుకు వెళ్లాలన్న ఆయన కోరికను దర్యాప్తు సంస్థలే తీర్చుతాయి: ఆది శ్రీనివాస్‌

  • కేటీఆర్‌కు ఇంగ్లిష్‌ ఫుల్‌.. సబ్జెక్టు నిల్‌: చామల

  • జైల్లో ఉండొచ్చిన కవిత కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు: మేడిపల్లి

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసులతో కేటీఆర్‌ హడలిపోతున్నాడని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. విచారణకు వెళ్తానంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బడాయి కబుర్లు చెబుతున్నాడని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. లైడిటెక్టర్‌ టెస్టుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘ఎవరి మీద కేసులుంటే వాళ్లు విచారణకు హాజరవుతారు తప్పా ఇంకొకరు వచ్చి లైడిటెక్టర్‌, నార్కో ఎనాలసిస్‌ టెస్ట్‌లు చేసుకోరు. మీ కుటుంబానికి అంత ధైర్యముంటే నీతోపాటు మీ అయ్య, చెల్లెలు, బావకు నార్కో టెస్ట్‌లు చేయించు. మీ కమీషన్ల కక్కుర్తి, స్కాముల బాగోతం బయటపడుతుంది. చాలెంజ్‌లు విసిరి పారిపోయిన చరిత్ర నీదే.. గతంలో డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో వైట్‌ చాలెంజ్‌కు రావాలని పిలిస్తే పారిపోలేదా? సంక్షేమం, అభివృద్ధితో మా ప్రభుత్వం ముందుకుపోతుంటే కేటీఆర్‌ పిచ్చి ప్రేలాపనలు, రోత మాటలు మాట్లాడుతున్నాడు. జైలుకు వెళ్లాలన్న ఆయన ఉబలాటాన్ని, కోరికను దర్యాప్తు సంస్థలే తీర్చుతాయి. కేటీఆర్‌ మాటలను కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం సహించరు’ అని హెచ్చరించారు. కేటీఆర్‌కు ఇంగ్లిష్‌ ఫుల్‌, సబ్జెక్ట్‌ నిల్‌ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఓవర్‌ యాక్షన్‌తోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. ఫార్ములా ఈ-రే్‌సలో పాలనా అనుమతులు లేకుండా రూ.44 కోట్లు ఎలా మళ్లించారని ఏసీబి ప్రశ్నిస్తోందన్నారు.

అవకతవకలు, అక్రమాలు జరిగినపుడు ఆయా ఏజెన్సీలు విచారణ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. మొన్న కేసీఆర్‌ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత ఈ రోజు మా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు నోటీసులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై కవిత ఆరోపణలు, విమర్శలన్నీ డ్రామాయేనని స్పష్టమవుతోందని చెప్పారు. మద్యం కుంభకోణంలో దొరికిపోయి ఆరు నెలల పాటు తిహాడ్‌ జైలులో ఉండొచ్చిన కవిత సైతం తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఆమె తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అసలు కవిత ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సలో ఉంటే ఆ దయ్యాలెవరో, కోవర్టులెవరో తేల్చుకోవాలని.. ఆ తర్వాత తమ ప్రభుత్వం గురించి మాట్లాడాలని చెప్పారు. ‘మీ అయ్య స్కూల్‌ కాంగ్రె్‌సలో, కాలేజీ టీడీపీలో చదివి.. బీఆర్‌ఎ్‌సలో ఉద్యోగం సరిగా చేయక, అక్రమాలకు పాల్పడి ప్రజల చేత డిస్మిస్‌ అయ్యాడు. ప్రతిపక్ష నాయకుడిగా సైతం గుండు సున్నా మార్కులు తెచ్చుకుని విఫల రాజకీయ నాయకుడిగా మారాడు. ముందు బీఆర్‌ఎ్‌సలో నీ స్థానమేంటో తేల్చుకో..’ అని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 05:39 AM