ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హజ్‌ యాత్ర షురూ..

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:45 AM

ముస్లింల పవిత్ర హజ్‌ యాత్రకు యాత్రికుల రాక ప్రారంభమైంది. భారత్‌ నుంచి యాత్రికులతో తొలి విమానం మంగళవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని పుణ్యక్షేత్రం మదీనాకు చేరుకుంది.

  • భారత్‌నుంచి మదీనాకు చేరుకున్న విమానం

  • నెల రోజులపాటు కొనసాగనున్న యాత్ర

  • ఈ ఏడాది భారత్‌ నుంచి 1.30 లక్షలమంది

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ముస్లింల పవిత్ర హజ్‌ యాత్రకు యాత్రికుల రాక ప్రారంభమైంది. భారత్‌ నుంచి యాత్రికులతో తొలి విమానం మంగళవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని పుణ్యక్షేత్రం మదీనాకు చేరుకుంది. యాత్రికులకు ఇక్కడి భారత రాయబారి సుహాల్‌ ఎజా్‌సఖాన్‌, కాన్సుల్‌ జనరల్‌ ఫహాద్‌ఖాన్‌ సూరీ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 260 మంది యాత్రికులు వచ్చారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరానికి చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ పండితుడు అహ్మద్‌ షమ్రియా సహా అనేక మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉన్నారు.


కాగా, హజ్‌ యాత్ర కోసం హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా యాత్రికులను ప్రత్యేక విమానాలు మే 30వ తేదీ వరకు సౌదీ అరేబియాకు తీసుకొస్తాయి. ఈ నెల రోజుల్లో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి మొత్తం 12 వేల మంది యాత్రికులు హజ్‌ యాత్రకు రానుండగా, వారిలో 8వేల మంది తెలంగాణ వారు, 1200 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉండనున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారు రానున్నారు. మొత్తంగా ఈ ఏడాది భారత్‌ నుంచి లక్షా 30 వేల మంది యాత్రికులు హజ్‌ యాత్రకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు హైదరాబాద్‌తోపాటు బెంగళూరు విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాకు చేరుకుంటారు.

Updated Date - Apr 30 , 2025 | 04:45 AM