ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యూచర్‌సిటీలో.. ఎఫ్‌సీడీఏ ద్వారానే లేఅవుట్‌ అనుమతులు

ABN, Publish Date - Jun 17 , 2025 | 04:20 AM

ఫ్యూచర్‌సిటీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో లేఅవుట్ల తుది అనుమతి విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • డీటీసీపీ నుంచి ఎఫ్‌సీడీఏ, హెచ్‌ఎండీఏకు అధికారాలు

  • పరిధి ఆధారంగా పరిష్కారానికి ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌16 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌సిటీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో లేఅవుట్ల తుది అనుమతి విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో డ్రాఫ్ట్‌, తుది లేఅవుట్లను డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) జారీ చేసేది. అయితే.. 7,257 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిని ప్రభుత్వం 10,472 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. నల్లగొండ, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 300 గ్రామాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకువచ్చింది. అదే సమయంలో 36 గ్రామాలను హెచ్‌ఎండీఏ పరిధి నుంచి తొలగిస్తూ.. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ(ఎ్‌ఫసీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత డీటీసీపీ డ్రాఫ్ట్‌ లేఅవుట్లను జారీ చేస్తున్నా.. తుది లేఅవుట్‌ అనుమతికి ఎవరిని ఆశ్రయించాలనే సందిగ్ధత నెలకొని ఉండేది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టతనిస్తూ.. హెచ్‌ఎండీఏ, ఎఫ్‌సీడీఏలకు ఆ అధికారాలను దఖలుపరిచింది. దీని ప్రకారం.. హెచ్‌ఎండీఏ, ఫ్యూచర్‌సిటీ పరిధిలోని గ్రామాల్లో డ్రాఫ్ట్‌, తుది లేఅవుట్లకు డీటీసీపీకి ఎలాంటి అధికారాలు ఉండవు. అయితే.. ఇప్పటికే డీటీసీపీ ఇచ్చిన డ్రాఫ్ట్‌ లేఅవుట్ల ఆధారంగా తుది లేఅవుట్లకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఎండీఏ, ఎఫ్‌సీడీఏలను మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది. పరిధి ఆధారంగా లేఅవుట్ల దరఖాస్తులను పరిష్కరించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పంచాయతీ పోర్టల్‌ ద్వారా డీటీసీపీకి చేసిన డ్రాఫ్ట్‌ లేఅవుట్‌ దరఖాస్తులను ప్రాసెస్‌ చేయకుంటే.. వాటిని దరఖాస్తుదారులకు తిప్పి పంపాలని తెలిపింది. అలాంటి దరఖాస్తులను పరిధిని బట్టి హెచ్‌ఎండీఏ లేదా ఎఫ్‌సీడీఏకు తిరిగి సమర్పించాలని తన ఆదేశాల్లో వివరించింది.

Updated Date - Jun 17 , 2025 | 04:20 AM