ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gandipet: గండిపేటలో పుట్టగొడుగుల్లా కన్వెన్షన్‌ సెంటర్లు

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:48 AM

గండిపేట చెరువును ఆనుకుని పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కన్వెన్షన్‌ సెంటర్ల అనుమతుల అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) డిమాండ్‌ చేసింది.

  • వాటికి అనుమతులున్నాయా ? లేదా? విచారణ జరిపించండి

  • సీఎం రేవంత్‌ రెడ్డికి ఎఫ్‌జీజీ లేఖ

గండిపేట చెరువును ఆనుకుని పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కన్వెన్షన్‌ సెంటర్ల అనుమతుల అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) డిమాండ్‌ చేసింది. జన్వాడ గ్రామం, శంకర్‌పల్లి మండలంలో అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కన్వెన్షన్‌ సెంటర్లను నిర్మిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఓ లేఖ రాశారు. గండిపేట చెరువు నీటికి 500 మీటర్ల దూరంలో పలు కన్వెన్షన్‌ సెంటర్లు ఉన్నాయని, వీటికి అధికారిక అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయంపై జన్వాడ పంచాయతీ, నార్సింగి మునిసిపాలిటీల నుంచి స్పష్టత రావడం లేదని తెలిపారు.

సమాచార హక్కు చట్టం కింద నార్సింగి మునిసిపల్‌ కమిషనర్‌ నుంచి వివరాలు కోరగా.. ఆ సెంటర్లు చాలా కాలం క్రితం నిర్మాణమయ్యాయని, జన్వాడ గ్రామ పంచాయతీ వారు తమకు ఎలాంట అనుమతుల దస్త్రాలను బదిలీ చేయలేదని సమాధానమిచ్చారని తెలిపారు. గండిపేట చెరువును ఆనుకుని వెలిసిన కన్వెన్షన్‌ సెంటర్లపై స్పందించాలని ముఖ్యమంత్రిని కోరారు.

Updated Date - Jun 20 , 2025 | 04:48 AM