ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers Protest: రోడ్డెక్కిన అన్నదాతలు

ABN, Publish Date - May 24 , 2025 | 04:42 AM

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్నదాతలు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని రహదారిపై పోసి రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.

  • తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్‌

  • పలు జిల్లాల్లో ఆందోళనలు

  • తడిసిన సన్నధాన్యం బాయిల్డ్‌ మిల్లింగ్‌కు ప్రభుత్వ అనుమతి

  • నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు ప్రత్యేక ఉత్తర్వులు

హైదరాబాద్‌, జగిత్యాల, సిర్పూర్‌(టి), ఆర్మూర్‌ టౌన్‌/ఖానాపూర్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్నదాతలు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని రహదారిపై పోసి రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. జగిత్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో శుక్రవారం ఈ ఆందోళనలు జరిగాయి. జగిత్యాల జిల్లా సింగర్రావుపేట, తిప్పన్నపేట, గోపాలరావుపేట గ్రామాల్లో రైతులు రాస్తారోకో చేశారు. అలాగే, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) మండలం పారి గాంలోని సిర్పూర్‌(టి)- కౌటాల ప్రధాన రహదారిపై రైతులు చేపట్టిన రాస్తారోకోకు ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌ బాబు మద్దతు తెలిపారు. మరోపక్క, నిజామాబాద్‌ జిల్లా మామిడిపల్లిలోని గోవింద్‌పేట్‌ రోడ్డులో రైతులు ధర్నా చేశారు.


అలాగే, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సుర్జాపూర్‌ వద్ద ఖానాపూర్‌-మెట్‌పెల్లి రహదారిపై సుర్జాపూర్‌, మస్కాపూర్‌, బాదనకుర్తి గ్రామాల రైతులు బైఠాయించారు. కొనుగోళ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, వర్షాలకు తడిచిన సన్నధాన్యాన్ని ముడిబియ్యంగా కాకుండా బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13,850 టన్నుల ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ బియ్యా న్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) రూపం లో ఎఫ్‌సీఐకి అప్పగించాలని నిర్ణయించింది. నిజామాబాద్‌, వరంగల్‌ కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ ప్రసాద్‌ ఆ జిల్లాల వరకు శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 24 , 2025 | 04:42 AM