ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని రైతు ఆత్మహత్య
ABN, Publish Date - May 20 , 2025 | 04:50 AM
రీజినల్ రింగ్ రోడ్డులో తన భూమి పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామంలో సోమవారం జరిగింది.
గ జ్వేల్, మే 19 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డులో తన భూమి పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఇసుకంటి నర్సింహులు (45)కు చెందిన రెండు ఎకరాల భూమి హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డులో భాగంగా ప్రభుత్వం సేకరిస్తోంది.
భూసేకరణ పరిహారంపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆర్డీవో కార్యాలయం చుట్టూ, గజ్వేల్ పట్టణంలోని నేషనల్ హైవే అథారిటీ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. నర్సింహులుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Updated Date - May 20 , 2025 | 04:50 AM