ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈబీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయండి

ABN, Publish Date - Jun 15 , 2025 | 06:34 AM

తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్‌ వల్లపురెడ్డి రవీందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

  • మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కూడా..

  • సీఎంకు ఈబీసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్‌ వల్లపురెడ్డి రవీందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంను ఆయన నివాసంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈబీసీ కమిషన్‌ ఏర్పాటుతోపాటు ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ అగ్రవర్ణాలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని కోరారు. త్వరలో ఈబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారని రవీందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 06:34 AM