ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫోర్త్‌ సిటీతో ఈస్ట్‌ హైదరాబాద్‌ అభివృద్ధి

ABN, Publish Date - Jun 06 , 2025 | 06:55 AM

ఈస్ట్‌ హైదరాబాద్‌.. రానున్న కొద్దికాలంలో అభివృద్ధిలో పరుగులు పెట్టబోతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి బిల్డర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న రిజిస్ర్టేషన్‌, ఎన్‌ఓసీ, ఓసీ సమస్యలను సంబంధిత మంత్రి, అవసరమైతే నేరుగా సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

హైదరాబాద్: ఫోర్త్‌ సిటీ నిర్మాణంతో రానున్న కొద్దికాలంలో ఈస్ట్‌ హైదరాబాద్‌ అభివృద్ధిలో పరుగులు పెట్టబోతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridharbabu) పేర్కొన్నారు. నాగోల్‌లో గ్రేటర్‌ ఈస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ (గెబా) యూత్‌ వింగ్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బిల్డర్లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా గెబా యూత్‌ వింగ్‌ అధ్యక్షుడు విక్రమ్‌కుమార్‌ ఈస్ట్‌జోన్‌ పరిధిలోని బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెసుకెళ్లారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇక్కడి బిల్డర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న రిజిస్ర్టేషన్‌, ఎన్‌ఓసీ, ఓసీ సమస్యలను సంబంధిత మంత్రి, అవసరమైతే నేరుగా సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.


ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఈస్ట్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు. గెబా సభ్యులు అక్షయ్‌సాధు, మారం మేఘన, మిడిదొడ్డి మహేష్‌, సంతోష్‏రెడ్డి, వినీత పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 06:55 AM