Drunken Drive Suicide Attempt: డ్రంకెన్ డ్రైవ్ కేసు పెడతారా అంటూ.. పెట్రోల్‌తో నిప్పంటించుకున్న వ్యక్తి
ABN, Publish Date - Jul 30 , 2025 | 04:23 AM
డ్రంకెన్ డ్రైవ్‌లో కేసులో పట్టుబడిన ఓ వ్యక్తి, పోలీ్‌సస్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
40% కాలిన శరీరం.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
నల్లగొండ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్‌లో కేసులో పట్టుబడిన ఓ వ్యక్తి, పోలీ్‌సస్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండలోని వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్ ఆవరణలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన రావిళ్ల నర్సింహా దేవరకొండ రోడ్డులో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో దొరికాడు. దీంతో పోలీసులు ద్విచక్రవాహనాన్ని పక్కన పెట్టించి అతడిని అక్కడి నుంచి పంపించారు.
రాత్రి 11.30 గంటల ప్రాంతంలో శరీరంపై పెట్రోలు పోసుకుని పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్న నర్సింహా.. ’నాపైనే కేసు పెడతారా’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. దీంతో మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అంజత్ వెంటనే దుప్పటి కప్పి మంటలు ఆర్పాడు. అతడిని కాపాడే ప్రయత్నంలోఓ హోంగార్డు కూడా గాయపడ్డాడు. 40 శాతం శరీరం కాలడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Jul 30 , 2025 | 04:23 AM