ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Drug Smuggling Gang Busted: గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:46 AM

గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు. శామీర్‌పేట, ఎస్‌వోటీ పోలీసులు 273 కిలోల డ్రై గంజాయితో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు

273 కిలోల డ్రై గంజాయి జప్తు.. ముగ్గురి అరెస్టు

మూడుచింతలపల్లి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఇల్లు మారుతున్నప్పుడు సామగ్రి రవాణ సేవలందించే ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థ ముసుగులో ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా హరియాణకు గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును శామీర్‌పేట, ఎస్‌వోటీ పోలీసులు రట్టుచేశారు. పంజాబ్‌వాసి పర్దీప్‌కుమార్‌, హరియాణా వాసులు సన్నీ, మనీష్‌ కుమార్‌..బోయిన్‌పల్లిలో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థ నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్‌సీబీ కేసులో శిక్ష పడిన వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి హరియాణకు భారీగా గంజాయి రవాణాకు పథకం వేశారు. ఒడిశా సప్లయర్‌ సుభాష్‌ బిశ్వాస్‌తో ఒప్పందం చేసుకున్నారు. బొలెరో వాహనంలో బయలుదేరిన ఈ ముఠా ప్రతి రోజూ రూట్‌ మారుస్తూ.. పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కకుండా తమ మధ్య కమ్యూనికేషన్‌ కోసం జియో డాంగిల్‌సాయంతో వాట్సాప్‌ సేవలను వాడుకున్నారు. ఈ ముఠా పథకం గురించి పక్కా సమాచారం తెలుసుకున్న బాలానగర్‌ ఎస్‌ఓటీ, శామీర్‌పేట పోలీసులు ఆదివారం తెల్లవారుజామున శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద తనిఖీ చేయడంతో గంజాయి బయట పడింది. 273 కిలోల డ్రై గంజాయి (రూ.95 లక్షలు), బొలెరో (రూ.5 లక్షలు), జియో డాంగిల్‌ (రూ.70 వేలు), ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి ఆదివారం మీడియాకు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:46 AM