ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Award: వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు లోహియా సామాజిక న్యాయ పురస్కారం

ABN, Publish Date - Mar 24 , 2025 | 03:48 AM

బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు లోహియా సామాజిక న్యాయ పురస్కారం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని విష్ణు దిగంబర్‌ మార్గ్‌లో రాజారామ్మోహన్‌ రాయ్‌ మెమోరియల్‌ హాల్‌లో ఆదిలీలా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పురస్కార వేడుక జరిగింది.

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు లోహియా సామాజిక న్యాయ పురస్కారం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని విష్ణు దిగంబర్‌ మార్గ్‌లో రాజారామ్మోహన్‌ రాయ్‌ మెమోరియల్‌ హాల్‌లో ఆదిలీలా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పురస్కార వేడుక జరిగింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, నేషనల్‌ మినరల్‌ ఫర్‌ క్లీన్‌ గంగా డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించిన జి.అశోక్‌కుమార్‌.. కృష్ణమోహన్‌రావుకు అవార్డును అందజేశారు.


ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. లోహియా అవార్డు తన జీవితంలో కీలక మలుపు అన్నారు. లోహియా కృషి వల్లే దేశంలో బలహీనవర్గాలకు మేలు జరుగుతోందని చెప్పారు. అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో కృష్ణమోహన్‌ సేవలను ప్రత్యక్షంగా చూశానన్నారు. ఈ పురస్కారం కింద రూ.1.5 లక్షలు అందిస్తారు.

Updated Date - Mar 24 , 2025 | 03:48 AM