అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ కోర్సు
ABN, Publish Date - Jul 03 , 2025 | 03:46 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు జూలై 16 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారులు బుధవారం ఓ ప్రక టనలో తెలిపారు. ఆగస్టు 10న రాష్ట్రంలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో మాత్రమే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఐ-సెట్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చని వెల్లడించారు.
Updated Date - Jul 03 , 2025 | 03:46 AM