UPSC Success Story: ఫోన్, సోషల్‌మీడియాకు దూరం
ABN, Publish Date - Apr 23 , 2025 | 04:09 AM
సివిల్స్‌ను లక్ష్యంగా నిర్దేశించుకుని.. క్రమశిక్షణతో చదివేవారికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. నేను ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఫోన్‌ను అస్సలు వినియోగించలేదు. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నాను.
సివిల్స్‌ను లక్ష్యంగా నిర్దేశించుకుని.. క్రమశిక్షణతో చదివేవారికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. నేను ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఫోన్‌ను అస్సలు వినియోగించలేదు. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నాను. ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో రోజుకు 10 నుంచి 12 గంటలు చదివా. స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ప్రిపేర్ అయ్యా. సిలబ్‌సను పూర్తిస్థాయిలో విభజించుకొని ఏ రోజు చదవాల్సిన సిలబ్‌సను అదే రోజు పూర్తి చేసేదాన్ని. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పూర్తి చేయలేకపోయాను.
రెండో ప్రయత్నంలో పూర్తిస్థాయిలో కృషి చేశాను. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే.. ప్రశ్నలకు సమాధానాల రూపంలో కాకుండా సంభాషణ రూపంలో మాట్లాడేలా సాధన చేశాను. నాకు మా నాన్నే స్ఫూర్తి. తల్లిదండ్రులతో పాటు నేను కూడా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలనే కలలు కన్నాను. నన్ను ప్రోత్సహించిన అమ్మానాన్నలకు నేను సదా కృతజ్ఞురాలిని.
- సాయి శివాని, 11వ ర్యాంకర్
Updated Date - Apr 23 , 2025 | 04:09 AM