ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: వాహనాలు తనిఖీచేస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - May 31 , 2025 | 04:17 AM

గోరక్షక్‌ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

  • గోరక్షక్‌ బృందాలకు డీజీపీ జితేందర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): గోరక్షక్‌ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. జూన్‌ 7న బక్రీద్‌ పండుగ సందర్భంగా డీజీపీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. గతంలో గోరక్షక్‌ బృందాల వల్ల సామాజిక ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసు విభాగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనట్టు తెలిపారు.


జంతువుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు అంతర్‌రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకంగా పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి చెక్‌పోస్టుకు పశువైద్యులను నియమించామని చెప్పారు.

Updated Date - May 31 , 2025 | 04:17 AM