ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి

ABN, Publish Date - May 05 , 2025 | 04:15 AM

వేసవి సెలవులు, పరీక్షా ఫలితాల కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 46 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనం కోసం విచ్చేసి, ప్రత్యేక ధర్మదర్శనాలకు ఎక్కువ సమయం ఎదురుచూశారు

యాదగిరిగుట్ట, మే 4(ఆంధ్రజ్యోతి): వరుసగా వెలువడిన పరీక్షా ఫలితాలు.. వేసవి సెలవులు.. వారాంతం కలిసి రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తజనసంద్రమైంది. కొండపైన, కింద పార్కింగ్‌ ప్రదేశాలు వాహనాలతో నిండిపోగా వైకుంఠద్వారం ఇరువైపులా వాహనాలను పార్కింగ్‌ చేశారు. సుమారు 46 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ఉచిత ధర్మదర్శన క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనాలకు 3 గంటల సమయం పట్టింది. మరోవైపు శని, ఆదివారాల్లో ప్రముఖులకే ప్రోటోకాల్‌ దర్శనాలుంటాయని ఈవో వెంకట్రావు తెలిపారు.

Updated Date - May 05 , 2025 | 04:15 AM