Traditional Handloom: అందాల భామలకు అందమైన డ్రెస్సులు
ABN, Publish Date - May 17 , 2025 | 03:51 AM
సంప్రదాయ చేనేత బట్టలకు ఆధునిక శైలిలో రూపొందించి మిస్ ఇండియా వంటి అంతర్జాతీయ ఈవెంట్‌లో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు డిజైనర్ స్వాతి.
చేనేతకు ఆధునిక శైలి అలరించిన తెలుగు డిజైనర్ దుస్తులు
వికారాబాద్, మే 16 ఆంధ్రజ్యోతి: సంప్రదాయ చేనేత బట్టలకు ఆధునిక శైలిలో రూపొందించి మిస్ ఇండియా వంటి అంతర్జాతీయ ఈవెంట్‌లో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు డిజైనర్ స్వాతి. ప్రత్యేకంగా పోచంపల్లి, నారాయణపేట వంటి చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల్ని వాడి ఆమె రూపొందించిన దుస్తులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా భూదాన్ పోచంపల్లిలో ముద్దుగుమ్మలకు డ్రెస్సులు రూపొందించిన స్వాతి వికారాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు మఠం వైద్యనాథ్ కూతురు.
ఆమె ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో మైరీతి, తరం పేరుతో డిజైనర్ స్టోర్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది సెలబ్రిటీలతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న ముద్దుగుమ్మలకు దుస్తులను రూపొందించే అవకాశం వచ్చింది. సంప్రదాయ వస్త్రాలకు ఆధునికతను జోడిస్తూ దుస్తులు రూపొందించడానికి నెల రోజులు కష్టపడ్డారు. గురువారం జరిగిన కార్యక్రమంలో అందాల భామలు ఈ డ్రెస్‌లు ధరించి అందరిని అలరించారు.
Updated Date - May 17 , 2025 | 03:51 AM