ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Damodar Rajanarasimha: వైద్యశాఖకు ప్రతి నెలా 536 కోట్లివ్వండి

ABN, Publish Date - Jun 29 , 2025 | 03:51 AM

వైద్య ఆరోగ్యశాఖకు ప్రతి నెలా రూ.536 కోట్లు ఇవ్వాలని వైద్యశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సచివాలయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిశారు.

  • ఆర్థిక మంత్రికి వైద్యశాఖ మంత్రి దామోదర వినతి

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖకు ప్రతి నెలా రూ.536 కోట్లు ఇవ్వాలని వైద్యశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సచివాలయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాఖలో ప్రతి నెలా చెల్లించాల్సిన బిల్లులు రూ.536 కోట్ల వరకు ఉంటున్నాయని భట్టి దృష్టికి తీసుకెళ్లారు.

ఇందులో ఆరోగ్యశ్రీకి రూ.100 కోట్లు, ఔషధాల కొనుగోలుకు రూ.50 కోట్లు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.186 కోట్లు, రోగుల డైట్‌కు రూ.6.50 కోట్లు, డీఎంఈ పరిఽధిలోని ఐఎ్‌ఫహెచ్‌ఎ్‌స సేవలకు రూ.22 కోట్లు, విద్యుత్‌ చార్జీలకు రూ.10 కోట్లు, డాక్టర్ల స్టైపెండ్‌ (పీజీ, ఎస్‌ఆర్స్‌)కు రూ.47 కోట్లు, సివిల్‌ వర్క్స్‌కు రూ.100 కోట్లు, ఇతరత్రాలకు కలిపి మొత్తం రూ.536 కోట్లు అవుతున్నాయని భట్టికి వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి ప్రతి నెలా ఈ కనీస మొత్తాన్ని విడుదల చేసేందుకు అంగీకరించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jun 29 , 2025 | 03:51 AM