ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Daggubati Family : నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..

ABN, Publish Date - Aug 01 , 2025 | 10:20 AM

ఫిలిమ్‌‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఇవాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో న‌టులు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై ఫిలిమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Daggubati Family

హైదరాబాద్ : ఫిలిమ్‌‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఇవాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో న‌టులు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై ఫిలిమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన పట్టించుకోకపోవడంతో సురేష్ బాబు, వెంకటేష్, రానాలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అయితే వారు విచారణకు హాజరువుతారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

గతంలో నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు.సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో మళ్లీ నందకుమార్ దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిమ్‌నగర్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో నేడు దుగ్గుబాటి కుటుంబం విచారణకు హాజరుకావాలిని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Updated Date - Aug 01 , 2025 | 10:28 AM