ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber crime: సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!

ABN, Publish Date - Aug 02 , 2025 | 05:41 AM

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ చూపిన సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.3 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎ్‌సబీ) నలుగురిని అరెస్టు చేసింది.

  • పెట్టుబడి పేరిట ఒకరికి రూ.3 కోట్లు టోకరా

  • మరో కేసులో వ్యాపారికి రూ. కోటి టోపీ

హైదరాబాద్‌/సిటీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ చూపిన సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.3 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎ్‌సబీ) నలుగురిని అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని నార్త్‌ లాలాగూడకు చెందిన ఒకరు జూన్‌ 28న టీజీసీఎ్‌సబీకి ఈ మోసంపై ఫిర్యాదు చేశారు. అతని వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న అనుప్రీత డాగా అనే మహిళ.. తాను ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ సీఈవోకి అసిస్టెంట్‌ మెంటార్‌నని చెప్పి బాధితుడిని నమ్మించింది. మే 29న బాధితుడికి ట్రేడింగ్‌ ఇన్వె్‌స్టమెంట్‌లో లాభాలు వస్తాయని నమ్మించి ఒక లింక్‌ పంపి దాని ద్వారా ఖాతాతెరిపించింది. జూన్‌ 19న ‘ఇన్‌ఫ్లూక్స్‌ హెల్త్‌ టెక్‌ లిమిటెడ్‌’ అనే కంపెనీ ఐపీవోలో కొద్దిపాటి షేర్లే మిగిలాయని, వెంటనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చింది. బాధితుడిని నచ్చజెప్పి రూ.3 కోట్ల విలువైన షేర్లు కొనేలా ఒప్పించింది. దీంతో అతడు ఆ మొత్తాన్ని 16 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. ఇలా మోసానికి పాల్పడిన నిందితులు శ్రీనివాస్‌ మనుబోతుల(45), సయ్యద్‌ యూసఫ్‌(45), చెక్క యెషయ్యా అలియాస్‌ శేఖర్‌(54), మహమ్మద్‌ జబేర్‌ అహ్మద్‌(42)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో కేసులో, మల్టీ విటమిన్‌ మాత్రల తయారీలో వినియోగించే స్పిరులినా పౌడర్‌ను విదేశాలకు ఎగుమతి చేసే కాంట్రాక్టు ఇప్పిస్తామని ఓ వ్యాపారి నుంచి రూ.1.11 కోట్లు వసూలు చేసిన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బషీర్‌బాగ్‌ సైబర్‌ క్రైం కార్యాలయంలో అదనపు సీపీ విశ్వప్రసాద్‌, డీసీపీ కవిత దారతో కలిసి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి స్పిరులినా పౌడర్‌ను విక్రయిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన లక్ష్యవర్మ అనే వ్యక్తి స్పిరులినా పౌడర్‌ను విదేశాలకు ‘బీ2బీ ఎక్స్‌పోర్ట్‌’ చేస్తే లాభాలు ఉంటాయని చెప్పాడు. హాంకాంగ్‌లో ఉండే ‘ఏసీఈఎస్‌ ట్రేడింగ్‌’ సంస్థ ద్వారా ఎగుమతుల కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ‘ఏసీఈఎస్‌ ట్రేడింగ్‌’ ప్రతినిధులమంటూ చెప్పుకొన్న పరా సింగ్లా, అతడి సోదరుడు మహేష్‌ సింగ్లాలను పరిచయం చేశాడు. వీరు పలు చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఎగుమతి అగ్రిమెంట్‌ పూర్తికాగానే డబ్బు వెనక్కు ఇస్తామని చెప్పడంతో బాధితుడు వారు సూచించిన ఖాతాలకు ఆరు నెలల్లో రూ.1.11 కోట్లు పంపించాడు. ఇంకా డబ్బు డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఖాతాల ఆధారంగా ఢిల్లీకి చెందిన నిందితులను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ భువన్‌విహార్‌లో వారి కార్యాలయంపై దాడి చేసి పరా సింగ్లాను అరెస్ట్‌ చేశారు. మహేష్‌ సింగ్లా, లక్ష్య వర్మ పరారీలో ఉన్నారు. బాఽధితుడి నుంచి వసూలు చేసిన డబ్బును నిందితులు వాడుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 05:41 AM