Cyber Crimes: తెలంగాణలో గణనీయంగా తగ్గిన సైబర్ నేరాలు
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:46 AM
తెలంగాణలో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షిఖా గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షిఖా గోయల్
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షిఖా గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 11ు సైబర్ నేరాలను తగ్గించగలిగామని, అదే సమయంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో 28ు పెరుగుదల నమోదయిందని ఆమె వివరించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల వల్ల ఆర్థిక నష్టాలు 12ు పెరగగా, తెలంగాణలో 19ు తగ్గాయని ఆమె తెలిపారు. 2024లో 13ు ఉన్న రికవరీ రేటు ఈ ఏడాది 16 శాతానికి చేరిందని ఆమె వివరించారు.
ఆర్ అండ్ బీలో 72 మందికి పదోన్నతులు
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. తాజాగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)లుగా పదోన్నతి కల్పించింది. సంబంధిత ఫైలుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీకానున్నాయి. డీఈఈల నుంచి ఈఈలుగా 72 మందికి పదోన్నతి కలగనుంది. ప్రస్తుతం శాఖలో దాదాపు 60 వరకు ఈ స్థాయి హోదా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మరో 4-5గురు త్వరలో పదవీ విరమణ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు 219 మందికి పదోన్నతులు లభించగా.. వరుసగా శాఖలో పదోన్నతులు వస్తుండడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Updated Date - Jun 02 , 2025 | 04:46 AM