John Wesley: గురుకుల విద్యార్థులతో పనులు చేయించడం దుర్మార్గం: జాన్ వెస్లీ
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:40 AM
రాష్ట్రంలో 240 గురుకులాల్లో 1200 మంది అసిస్టెంట్ కేర్‌టేకర్లను తొలగించి, అక్కడి విద్యార్థులతో మరుగుదొడ్లు, తరగతి గదులను, విద్యాసంస్థ ఆవరణను శుభ్రం చేయించాలనుకోవడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 240 గురుకులాల్లో 1200 మంది అసిస్టెంట్ కేర్‌టేకర్లను తొలగించి, అక్కడి విద్యార్థులతో మరుగుదొడ్లు, తరగతి గదులను, విద్యాసంస్థ ఆవరణను శుభ్రం చేయించాలనుకోవడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురుకులాల విద్యార్థుల గురించి అనుచితంగా మాట్లాడిన గురుకుల కార్యదర్శి వ్యాఖ్యలను సీపీఎం ఖండిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దీనిపై ప్రభుత్వం విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌలిదొడ్ది, చిలుకూరు వంటి ప్రతిష్ఠాత్మక గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 95ు మార్కులు వస్తేనే రెండో సంవత్సరం అడ్మిషన్ ఉంటుందన్న నిబంధన ఎత్తివేయాలన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 05:40 AM