ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రిమాండ్

ABN, Publish Date - Jun 21 , 2025 | 07:34 PM

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు ఖమ్మం జిల్లా జైలుకు తరలించనున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై ఉదయం నుం హైడ్రామా కొనసాగింది

వరంగల్ : హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు ఖమ్మం జిల్లా జైలుకు తరలించనున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై ఉదయం నుం హైడ్రామా కొనసాగింది. కౌశిక్‌ది అక్రమ అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు.

కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించడంపై పలువురు నేతలు స్పందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కౌశిక్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 07:46 PM