ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge: జులై 4న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ

ABN, Publish Date - Jun 26 , 2025 | 04:49 AM

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌.. అందులో భాగంగా గ్రామ, బ్లాకు, మండల కమిటీల అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్‌లో సభను నిర్వహించ తలపెట్టింది.

  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌.. అందులో భాగంగా గ్రామ, బ్లాకు, మండల కమిటీల అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్‌లో సభను నిర్వహించ తలపెట్టింది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలపై ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సభను విజయవంతం చేసే బాధ్యతను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నూతన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు. వారు గురువారం నుంచి తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి కమిటీ అధ్యక్షుల నియామకం, వారిని ఖర్గే సభకు తరలించే కార్యాచరణలో నిమగ్నం కానున్నారు. జులై 4న సాయంత్రం గ్రామ, మండల కమిటీల అధ్యక్షులతో ఖర్గే సభ జరగనుంది.

Updated Date - Jun 26 , 2025 | 04:49 AM