Jeevan Reddy: కాంగ్రెస్ సర్కారు ఉద్దేశమూ అదే..
ABN, Publish Date - May 20 , 2025 | 05:53 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.
బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చేలా ఆర్.కృష్ణయ్యే చొరవ తీసుకోవాలి: జీవన్‌రెడ్డి
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా బిల్లులను ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపిందన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య చొరవ చూపి.. ఆ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలంటూ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలపై గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు. హైదరాబాద్ నగరంలో పాత కరెంటు వైర్లన్నీ మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కోరారు. ఏళ్ల తరబడి ఉన్న వైరింగ్‌తో నిత్యం పాత ఇళ్లలోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ సమస్యను సర్కారు సీరియ్‌సగా తీసుకోవాలన్నారు.
Updated Date - May 20 , 2025 | 05:53 AM