CM Revanth Reddy: నేడు యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన
ABN, Publish Date - Jun 06 , 2025 | 02:56 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు.
రూ.1,500కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో బహిరంగ సభ
యాదాద్రి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ.1,500కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభకు 60వేల మంది హాజరవుతారన్న అంచనాలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.40గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. 3 గంటలకు తుర్కపల్లి మండలం తిర్మలాపురం చేరుకుంటారు. 3.10 నుంచి 3.25గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 3.25 నుంచి 4.40గంటల వరకు సభలో ప్రసంగించి, పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 4.45గంటలకు తిరుగుపయనమవుతారు.
Updated Date - Jun 06 , 2025 | 02:56 AM