ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సంయమనం పాటించండి

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:05 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య వివాదం పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డే నేరుగా రంగంలోకి దిగారు.

  • మంత్రి కొండా సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య వివాదం పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డే నేరుగా రంగంలోకి దిగారు. ఆదివారం మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుష్మితాపటేల్‌లను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో బాధ్యత గల నాయకులు అయ్యుండి.. పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిన అంశాలను బహిరంగంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీకి బలమైన నాయకుల అవసరమేనని, అయితే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమేనని సీఎం వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్ఠానం వరకు వెళ్లిందని, ఇక మీదట సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది. కాగా.. కొండా మురళి వ్యాఖ్యలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకున్న వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ సోమవారం గాంధీభవన్‌లో భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ సమావేశం వాయిదా పడినట్లు కమిటీ చైర్మన్‌ మల్లు రవి ప్రకటించారు. వరంగల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనాల్సి ఉన్నందున భేటీని ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు వ్యవసాయ యూనివర్సిటీ ఆవరణలో జరిగే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.. అనంతరం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. అలాగే అధిష్ఠానం పెద్దలనూ కలిసే ఆస్కారముంది. ఇటు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఆయన్ను సత్కరించి, వెండి నంది జ్ఞాపికను బహూకరించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతి, వారి హక్కుల కోసం జగ్జీవన్‌రామ్‌ ఎంతో కృషి చేశారని.. దేశానికి ఎనలేని సేవలందించారని ఈ సందర్భంగా కొనియాడారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 02:05 AM