CM Revanth Reddy: జూన్ 4 తర్వాతే సీఎం ఢిల్లీ టూర్!
ABN, Publish Date - May 31 , 2025 | 04:49 AM
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం తదితర అంశాలపై చర్చించేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా..
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం తదితర అంశాలపై చర్చించేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. 2న తెలంగాణ అవతరణ ఉత్సవాల నేపథ్యంలో 4 తర్వాతే ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
నేడు ఖమ్మంకు మీనాక్షి నటరాజన్
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్.. అందులో భాగంగా శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్‌తో కలిసి ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. మీనాక్షి శుక్రవారంనాడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లలో భువనగిరి, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు. సూర్యాపేట, జనగామ వంటి చోట్ల ఓటమికి కారణాలను ఆమెఆరా తీశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సహకరించని కారణంగానే తాను ఓటమి పాలైనట్లు జనగామ అభ్యర్థి కొమ్మూరు ప్రతా్‌పరెడ్డి ఆరోపించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
Updated Date - May 31 , 2025 | 04:49 AM