ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

ABN, Publish Date - May 17 , 2025 | 04:30 AM

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం దొంగలా దొరికిపోయారని, పదివేల కోట్ల కోసం రేవంత్‌రెడ్డి కక్కుర్తి పడటం వల్లే.. అంతలా ప్రకృతి విధ్వంసం జరిగిందని బీఆర్‌ఎస్‌ విప్‌ కేపీ వివేకానంద ఆరోపించారు.

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం దొంగలా దొరికిపోయారని, పదివేల కోట్ల కోసం రేవంత్‌రెడ్డి కక్కుర్తి పడటం వల్లే.. అంతలా ప్రకృతి విధ్వంసం జరిగిందని బీఆర్‌ఎస్‌ విప్‌ కేపీ వివేకానంద ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కె.సంజయ్‌, అనిల్‌ జాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు అద్దం పట్టాయన్నారు. అటవీ విధ్వంసం నేపథ్యంలో అధికారులకు శిక్ష విధించాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విధానం చూస్తుంటే.. రాజకీయ నాయకుల మాటలు వింటే జైలు పాలవుతారని ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని అనిపిస్తోందన్నారు.


అలాంటి కఠిన చట్టాలున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వన్యప్రాణులను చంపించిన సీఎంను కూడా శిక్షించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇంజనీరింగ్‌ చదువును ఉచితం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదని, దానికి తోడు పెరుగుతున్న ఫీజులను నియంత్రించడంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవుతోందని బీఆర్‌ఎ్‌సవీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ విమర్శించారు.

Updated Date - May 17 , 2025 | 04:31 AM