Gachibowli: కంచ గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివే
ABN, Publish Date - Mar 14 , 2025 | 05:35 AM
ఆర్థిక వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ చేసి, వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హెచ్‌సీయూకు సంబంధం లేదు
ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి ఐటీ, వాణిజ్య, నివాస జోన్ల అభివృద్ధి జరగనుంది
స్పష్టతనిచ్చిన టీజీఐఐసీ వర్గాలు
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ చేసి, వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భూమి ప్రభుత్వానిదేనని, ఎలాంటి ఆక్రమణల్లో లేదని, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని స్పష్టతనిచ్చాయి. ఆ భూముల్లో ఐటీ, వాణిజ్య, నివాస జోన్లను అభివృద్ధి చేయడంతో పాటు.. ఆ ప్రాంతాన్ని సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా మార్చనున్నట్లు వివరించాయి. లేఅవుట్ చేసి, వేలం వేయాలని నిర్ణయించిన 400 ఎకరాల భూమి హెచ్‌సీయూ పరిధిలో ఉందంటూ ఇటీవల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక వనరుల సంస్థ(టీజీఐఐసీ) ఈ భూములపై గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హద్దుల కోసం హెచ్‌సీయూ చేసిన అభ్యర్థన మేరకు 2024 జూలై 19న సంయుక్తంగా భూముల సరిహద్దులను గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూముల్లోని బఫెల్లో లేక్, పీకాక్ లేక్‌లు లేవనే విషయం కూడా ఈ సందర్భంగా తేలిందని తెలిపింది.
ఈ భూముల్లో రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారంలోని కొన్ని రాళ్లు ఉన్నాయని, వాటిని గ్రీన్‌జోన్‌గా ఏర్పాటుచేయనున్నామని, ఇందుకోసం పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. వర్సిటీకి చెందిన భూములను గానీ, నీటి వనరులు, రాతి నిర్మాణాలను గానీ తొలగించలేదని వివరించింది. కంచ గచ్చిబౌలి భూమూల్లో ఐటీ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటు కోసం టీజీఐఐసీ ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా.. సర్కారు 2024 జూన్ 26న తమకు కేటాయిస్తూ.. ఉత్తర్వులిచ్చిందని పేర్కొంది. 2024 జూలై 1న టీజీఐఐసీకి అధికారికంగా అప్పగించినట్లు తెలిపింది. ఈ భూముల్లో ఇంటిగ్రేటెడ్ డెవల్‌పమెంట్ కోసం టీజీఐఐసీ ఇటీవల టెండర్లను ఆహ్వనించిని విషయాన్ని గుర్తుచేసింది. లేఅవుట్ వేసిన భూములు ఎక్కువ ధర పలికేందుకు ఈ భూములకు దగ్గర్లో ఉన్న ఐఐఐటీ జంక్షన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు(ఎగ్జిట్ నంబరు 1)కు దగ్గర్లో ఉన్న జీఏఆర్ రోటరీ వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించి, ఇటీవల టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపింది.
ఇదీ భూముల కథ..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి సర్వే నంబరు 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో అప్పటి ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కేటాయించింది. అయితే.. ఆ ప్రాజెక్టు ప్రారంభంకాకపోవడంతో 2006లో ఆ భూముల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ అకాడమీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయిం
Updated Date - Mar 14 , 2025 | 05:35 AM