ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CIITU: ఒక్క ఓటు తేడాతో మహీంద్రాలో సీఐటీయూ గెలుపు

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:06 AM

జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్‌ మహీంద్ర కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సీఐటీయూ విజయం సాధించింది.

జహీరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్‌ మహీంద్ర కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో సీఐటీయూ విజయం సాధించింది. గురువారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఐన్‌టీయూసీ అభ్యర్థి జనక్‌ ప్రసాద్‌పై సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములు గెలుపొందారు. కర్మాగారంలో 543 ఓట్లు ఉండగా.. 539 ఓట్లు పోలయ్యాయి.


అందులో సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములుకు 270 ఓట్లు రాగా, జనక్‌ ప్రసాద్‌కు 269 ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో కలిపి సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములు.. ఎన్నికల్లో నాలుగు సార్లు గెలిచినట్లయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. సీఐటీయూ విజయంతో కార్మికులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Jun 06 , 2025 | 04:06 AM