ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై సీఎస్‌ తొలి సమీక్ష

ABN, Publish Date - May 03 , 2025 | 05:47 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు.. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తొలి సమీక్ష నిర్వహించారు. ఆ భూముల అంశానికి అనుబంధంగా ఉన్న అన్ని శాఖల ముఖ్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు.

  • వివాదానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చ

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు.. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తొలి సమీక్ష నిర్వహించారు. ఆ భూముల అంశానికి అనుబంధంగా ఉన్న అన్ని శాఖల ముఖ్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా హెచ్‌సీయూకి కేటాయించిన భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


భూముల విషయంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన పలు విషయాలపైనా చర్చించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కచ్చితమైన సమాధానాలను నివేదించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇక, ఈ భూముల వివాదం నేపథ్యంలో 7న ఢిల్లీలో జరగనున్న కేంద్ర సాధికారిత కమిటీ సమావేశంలో సమర్పించాల్సిన నివేదికలపైనా చర్చించినట్టు తెలిసింది.

Updated Date - May 03 , 2025 | 05:47 AM