Kishan Reddy: తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు
ABN, Publish Date - May 24 , 2025 | 04:16 AM
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రం.. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014 నుంచి రాష్ట్రానికి కొత్తగా పలు కేంద్ర సంస్థలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మూడు కేంద్ర సంస్థల గురించి వెల్లడించారు. మిల్లెట్స్ ప్రాధాన్యాన్ని పెంచే క్రమంలో భాగంగా మోదీ సర్కారు తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసిందని తెలిపారు.
రూ.250 కోట్లతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’ను కేంద్ర వ్యవసాయ శాఖ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుందని ఆయన పేర్కొన్నారు. అలాగే.. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభం కానుందని.. జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని (నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను) కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎేస్టట్ వ్యాపారుల దగ్గర నుంచి, పరిశ్రమల నుంచి ‘ట్రిపుల్ ఆర్ ట్యాక్స్’ పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Updated Date - May 24 , 2025 | 04:16 AM