ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CBI: ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగిపై సీబీఐ విచారణ

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:38 AM

మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్‌) మాజీ స్టోర్స్‌ ఇన్‌చార్జి మాశెట్టి గోపాల్‌పై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.

హైదరాబాద్‌/కంది, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్‌) మాజీ స్టోర్స్‌ ఇన్‌చార్జి మాశెట్టి గోపాల్‌పై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. 2010 నుంచి 2024 మధ్య కాలంలో గోపాల్‌ ఓడిఎ్‌ఫలో పనిచేస్తున్న సమయంలో లంచాలు తీసుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని అతనిపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. వెంటనే ఏసీబీ అధికారులు గోపాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సైన్యానికి యుద్ధ ట్యాంకులు తయారు చేసే ఫ్యాక్టరీ కావడంతో ఏసీబీ అధికారులు సీబీఐని రంగంలోకి దించారు. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ గోపాల్‌ తన ఆదాయానికి మించి 778ు ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. గోపాల్‌ ఇళ్లు, కార్యాలయాల్లో మూడు చోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.2.17 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించింది.

Updated Date - Jun 12 , 2025 | 05:38 AM