Hyderabadఫ మహా టీవీ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌వీ దాడి
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:22 AM
హైదరాబాద్, ఫిలింనగర్‌లో ఉన్న మహా టీవీ కార్యాలయంపై బీఆర్‌ఎ్‌సవీ కార్యకర్తలు శనివారం దాడి చేశారు.
కేటీఆర్‌పై ప్రసారమైన కథనానికి నిరసన
ఫర్నిచర్, కార్లపై రాళ్లు, ఓ ఉద్యోగికి గాయాలు
బంజారాహిల్స్, హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, ఫిలింనగర్‌లో ఉన్న మహా టీవీ కార్యాలయంపై బీఆర్‌ఎ్‌సవీ కార్యకర్తలు శనివారం దాడి చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ప్రసారం చేసిన కథనానికి నిరసనగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. సుమారు 20 మంది కార్యకర్తలు కార్యాలయంలోని సామగ్రి, బయట ఉన్న కార్లు ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఉద్యోగికి గాయాలయ్యాయి. దాడి సంగతి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం తదితరులు ఆ కార్యాలయాన్ని సందర్శించి దాడిని ఖండించారు.
మహాటీవీ ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎ్‌సవీ నేత గెల్లు శ్రీనివాస్‌తోపాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కేసీఆర్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేశారని పేర్కొంటూ మహా టీవీకి బీఆర్‌ఎస్ లీగల్ నోటీసులు పంపింది. మహాటీవీ విధానం మార్చుకోకపోతే పరువు నష్టం దావా, క్రిమినల్ డెఫమేషన్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 04:22 AM